: టెర్రరిస్టులంటే మగాళ్లే కాదు... మహిళలూ రంగ ప్రవేశం చేశారు!


టెర్రరిస్టు అంటే కర్కశంగా, ఆజ్ఞలు జారీ చేస్తూ, భుజాన ఏకే 47 మోస్తూ బుల్లెట్ల వర్షం కురిపించే మగాళ్లే గుర్తుకు వస్తారు. దూరాభారాలు తిరగడం, దేశదేశాల్లోని సహచరులను కలవడం, గుంపుగా ఉన్న జనంపై మారణాయుధాలతో విరుచుకుపడడం తదితర అంశాల్లో ఇంతవరకు మగవాళ్ల గురించే ఎక్కువగా విన్నాం. తాజాగా ఉగ్రవాదం రూపు మార్చుకుంటోంది. కర్కశత్వానికి మారుపేరుగా నిలుస్తున్న టెర్రరిజంలోకి మహిళలు కూడా ప్రవేశిస్తున్నారు. సుకుమారంగా కనిపిస్తూనే నిర్దయగా బుల్లెట్ల వర్షం కురిపించేందుకు మహిళలు సిద్ధపడుతున్నారు. సిరియాలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మహిళలను కూడా కదన రంగంలోకి పంపుతున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఒక మహిళా విభాగాన్ని సృష్టించి నియామకాలు జరుపుతున్నారు. ఈ విభాగంలో 60 మంది బ్రిటిష్ మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం. వారంతా 18 నుంచి 24 ఏళ్ల మధ్యవారేనని తెలుస్తోంది. ఈ మహిళా టెర్రరిస్టులకు ప్రతి నెలా జీతాలు చెల్లిస్తున్నారు. తమ కుమార్తెలు సిరియాలో ఉగ్రవాదులుగా మారారని వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News