: 'బ్రెయిన్ డెడ్' వ్యక్తి అవయవదానం... ఐదుగురి జీవితాల్లో కొత్త వెలుగులు
'బ్రెయిన్ డెడ్' అని డాక్టర్లు ప్రకటించిన ఓ వ్యక్తి అవయవదానంతో ఐదుగురు వ్యక్తులు తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుకోనున్నారు. కర్ణాటకకు చెందిన దేవేంద్ర (56) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని తమిళనాడు కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్సకు స్పందించలేదు. దీంతో, దేవేంద్రను 'బ్రెయిన్ డెడ్' అని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అతడి అవయవాలను ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొందరికి దానం చేయాలని భార్య, కుమారుడు, కుమార్తె నిర్ణయించారు. ఈ మేరకు ఓ కిడ్నీ కేజీ హాస్పిటల్ కు, మరో కిడ్నీ రామకృష్ణ హాస్పిటల్ కు, లివర్ చెన్నైలోని ఎంఐఓటీ ఆసుపత్రికి, రెండు కళ్ళను అరవింద్ ఆసుపత్రికి దానం చేశారు. ఓ బంధువు పెళ్ళి నిమిత్తం దేవేంద్ర అన్నూర్ వస్తుండగా అతను ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ప్రమాదానికి గురవడంతో ఆయన మరణించారు.