: కాశ్మీర్ బాధితులకు రెండు విమానాల్లో సామగ్రిని పంపాం: అశోక్ గజపతిరాజు
జమ్మూకాశ్మీర్ వరద బాధితులను ఆదుకోవడానికి చేపడుతున్న సహాయక చర్యల్లో విమానయానశాఖ కూడా పాల్గొంటోందని కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. బాధితులకు అవసరమైన సామగ్రితో కూడిన రెండు ఎయిర్ ఇండియా విమానాలు శ్రీనగర్ కు వెళ్లాయని వెల్లడించారు. రోడ్డు మార్గాలు ముంపుకు గురవడంతో... కేవలం వాయు మార్గం గుండానే సహాయక చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. హెలికాప్టర్ ద్వారా మందులు, ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.