: మహిళా జర్నలిస్టుల అరెస్ట్


తెలంగాణలో పత్రికా స్వేచ్ఛను రక్షించాలంటూ కేసీఆర్ క్యాంపు కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా జర్నలిస్టులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. వీరిని గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నోటికి నల్లగుడ్డ కట్టుకుని రోడ్డుపై బైఠాయించిన మహిళా జర్నలిస్టులను కుక్కల కంటే దారుణంగా ఈడ్చి పోలీసు వ్యానుల్లో తరలించారు. ఈ క్రమంలో కొందరు జర్నలిస్టుల చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. మహిళా జర్నలిస్టుల్లో ఒకరిద్దరు గర్భవతులు కూడా ఉన్నారు. అయినా, పోలీసులు ఇవేమీ పట్టించుకోకుండా అత్యంత దారుణంగా, కనికరం లేకుండా వ్యవహరించారని మహిళా జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్న సమయంలో, ఈ ఉదంతాన్ని లైవ్ కవరేజ్ చేస్తున్న మీడియాపై పోలీసులు జులుం ప్రదర్శించారు. లైవ్ కవరేజ్ ను అడ్డుకోవడానికి ఓబీ వ్యాన్ కేబుల్స్ ను కట్ చేశారు. మహిళా జర్నలిస్టుల చేతుల్లోని ప్లకార్డులను పీకి పారేశారు. పోలీసుల చర్యలపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News