: సీఎం క్యాంపు ఆఫీసు ఎదుట మహిళా జర్నలిస్టుల మౌన ప్రదర్శన


తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేయడంపై మహిళా జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం క్యాంపు ఆఫీసు ఎదుట నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి... వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎంఎస్ఓలు గత మూడు నెలల నుంచి ఈ రెండు ఛానెళ్ల ప్రసారాలను ఆపివేసి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నప్పటికీ... సీఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని వారు ఆరోపించారు. సీఎం వ్యవహార శైలితో వేలాది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని వారు ఆక్రోశించారు. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై జరుగుతున్న దాడిపై సీఎం తక్షణమే చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎంఎస్ఓలతో చర్చలు జరిపి ఈ రెండు ఛానెళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని మహిళా జర్నలిస్టులు కోరారు. ఇంత మంది మహిళా జర్నలిస్టులు రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేస్తుండటాన్ని సీఎం కేసీఆర్ అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందని కుండ బద్దలు కొట్టారు.

  • Loading...

More Telugu News