: నేడు ప్రజా కవి కాళోజీ శత జయంతి
ప్రజా కవి కాళోజీ నారాయణ రావు శత జయంతి వేడుకలు నేడు ఘనంగా జరగనున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ వేడుకలను అధికార కార్యక్రమంగా నిర్వహించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటు రాజధాని హైదరాబాద్ తో పాటు కాళోజీ సొంత జిల్లా వరంగల్ లోనూ కార్యక్రమాలను చేపట్టనున్నారు. రెండు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా హాజరుకానున్నారు. ఉదయం వరంగల్ వెళ్లనున్న కేసీఆర్, సాయంత్రం హైదరాబాద్ లో జరిగే కాళోజీ జయంతి వేడుకల్లో పాల్పంచుకుంటారు. ఇదిలా ఉంటే, కాళోజీ స్మారకార్థం వరంగల్ లో కాళోజీ కళా కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లోని రవీంద్రభారతి తరహాలో భారీ హంగులతో ఏర్పాటు కానున్న ఈ కేంద్ర భవన నిర్మాణ సముదాయానికి నేడు కేసీఆర్ పునాది రాయి వేయనున్నారు. 1914లో జన్మించిన కాళోజీ, 2002, నవంబర్ 13న తన 88వ ఏట మరణించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనడంతో పాటు తెలంగాణ తొలితరం ఉద్యమ నేతగా కాళోజీ చిరపరచితులు. తన కవితల ద్వారా తెలంగాణ ప్రజలను ఉద్యమ బాట పట్టించారు. ‘నా గొడవ’ తరహా రచనలతో తెలంగాణ ప్రజలను ఆయన నిద్రలేపారు.