: తాతయ్యలు కాబోతున్న చంద్రబాబు, బాలకృష్ణ


నారా... నందమూరి కుటుంబాలకు అతి త్వరలో మరపురాని...మరువలేని మధుర క్షణాలు రానున్నాయి. బాలయ్య, చంద్రబాబుల నివాసాలు సరికొత్త ఆనంద హేలకు త్వరలో వేదిక కానున్నాయి! అవును... మీరు వింటున్నది నిజమే... చిట్టి చిట్టి పాదాల చిన్నారి...బోసి నవ్వుల బుజ్జాయి వచ్చే ఏడాది వారింట పారాడబోతున్నట్టు చంద్రబాబు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది. చంద్రబాబుకు ఏకైక కుమారుడైన లోకేష్ కు... బాలకృష్ణ పెద్ద కుమార్తె అయిన బ్రాహ్మణికి 2007లో ఘనంగా వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ దంపతులు త్వరలో అమ్మానాన్నలు కాబోతున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు.

  • Loading...

More Telugu News