: నేడు వరంగల్ వెళుతున్న కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వరంగల్ వెళుతున్నారు. హన్మకొండలోని బాలసముద్రంలో రెండెకరాల స్థలంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట నిర్మించనున్న కాళోజీ కళా కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాదులోని రవీంద్రభారతికి దీటుగా దీన్ని నిర్మించాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ కళా కేంద్రంలో రెండువేల మంది కూర్చునేందుకు వీలుగా ఆడిటోరియం, ఉద్యానవనం ఏర్పాటు చేయనున్నారు. ఆడిటోరియం ముందు భాగంలో కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. కాళోజీ శతజయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం దీన్ని నిర్మిస్తున్నారు.

  • Loading...

More Telugu News