: 2500 మంది ఖైదీలకు విముక్తి


తమిళనాడులో 2500 మంది ఖైదీలకు విముక్తి లభించనుంది. తమిళనాడులో నిర్వహించిన జైల్ అదాలత్‌లో వీరందరికీ విముక్తి కల్పించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విచారణ ఖైదీలు, చేసిన నేరానికి పడిన శిక్షాకాలంలో 50 శాతం పూర్తయినట్టైతే వారు విడుదలకు అర్హులని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే తమ కేసుల వాదోపవాదాలకు న్యాయవాదులను నియమించుకోలేనివారు, కోర్టులు విధించే జరిమానాలను చెల్లించలేని పేదల కేసులను జైల్ అదాలత్ పరిధిలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయా కేటగిరీలకు చెందిన నిందితులు తమ నేరాన్ని అంగీకరించి, పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన పక్షంలో వారిని కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో తమిళనాట 121 జైళ్లలో జైల్ అదాలత్ నిర్వహించి, జైళ్లలో వివిధ కారణాలతో మగ్గుతున్న 2500 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఖైదీల విడుదలపై సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు అందగానే రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులతో విడుదల చేస్తామని జైళ్లశాఖ ఐజీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News