: ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నరే నిర్ణయిస్తారు: రాజ్ నాథ్ సింగ్
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి సూటిగా సమాధానం ఇచ్చేందుకు తప్పించుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్... ఆ అంశాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ పై నెట్టారు. ఆ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ (నజీబ్ జంగ్) మాత్రమే నిర్ణయం తీసుకోగలరని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, ఈ అంశంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి హోంశాఖ ఏ సిఫారసు చేసిందన్న దానిపై మంత్రి స్పందిస్తూ, అసలు, రాష్ట్రపతి తమ సలహా ఏమీ కోరలేదని తెలిపారు. ఇక, తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశచూపి, వారిని కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతల వ్యాఖ్యలపై మాట్లాడేందుకు రాజ్ నాథ్ తిరస్కరించారు.