: 10.80 లక్షలు పలికిన అమీర్ పేట్ లడ్డూ
హైదరాబాదు జంటనగరాల్లో గణపతి నిమజ్జనోత్సవం సందర్భంగా లడ్డూల వేలం జనరంజకంగా సాగుతోంది. లడ్డూలను సొంతం చేసుకునేందుకు ఎవరికి వారు పోటీ పడుతున్నారు. గణపతి ఉత్సవాల్లో గణనాథుని సన్నిధిలో ఉంచిన లడ్డూను సొంతం చేసుకున్నవారికి ఏడాదంతా శుభాలే జరుగుతాయనే నమ్మకంతో భారీ సంఖ్యలో భక్తులు లడ్డూ వేలం పాటలో పాల్గొని తమ శక్తిని ప్రదర్శిస్తుంటారు. ఎప్పుడూ అధిక ధర పలికే బాలాపూర్ లడ్డూ కేవలం తొమ్మిదిన్నర లక్షల రూపాయలు పలకగా, అమీర్ పేటలో గణేశుడి లడ్డూ ఏకంగా 10.80 లక్షల రూపాయల పలికి రికార్డు సృష్టించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎన్.వి. బాబు వేలంలో ఈ లడ్డూను దక్కించుకున్నారు.