: చాంపియన్స్ లీగ్ లో పాల్గొనే పాక్ దేశవాళీ జట్టుకు వీసాల మంజూరు


చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ దేశవాళీ జట్టు లాహోర్ లయన్స్ కు మార్గం సుగమమైంది. ఇప్పటిదాకా లాహోర్ జట్టు టోర్నీలో పాల్గొనే విషయమై అనిశ్చితి నెలకొని ఉంది. ఆ జట్టు ఆటగాళ్ళకు భారత్ హైకమిషన్ వీసాలు మంజూరు చేయడంతో పాక్ క్రికెట్ వర్గాల్లో హర్షం నెలకొంది. దీంతో, ఇకపై ఐపీఎల్ లోనూ పాక్ క్రికెటర్లు పాల్గొనే అవకాశాలు మెరుగయ్యాయని భావిస్తున్నామని పీసీబీ వర్గాలు తెలిపాయి. కాగా, ఆయా దేశాల టీ20 చాంపియన్లు, రన్నరప్ లు, మూడోస్థానంలో నిలిచిన జట్లు పాల్గొనే ఈ చాంపియన్స్ లీగ్ సమరం భారత్ వేదికగా సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనుంది.

  • Loading...

More Telugu News