: విశాఖలో రికార్డు సృష్టించిన లడ్డూ ధర


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో ఓ లడ్డూ ధర రికార్డు నెలకొల్పింది. ఇక్కడి మురళీ నగర్ లో ఏర్పాటు చేసిన విజయ గణపతి లడ్డూ వేలం పాటలో ఏకంగా రూ.12.75 లక్షలు వెచ్చించి ఓ భక్తుడు దక్కించుకున్నాడు. ఈ డబ్బును చిన్నపిల్లల గుండె చికిత్స కోసం ఏపీ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు ఇస్తామని మండపం నిర్వాహకులు చెప్పారు. ఇక గుంటూరులోని మిర్చి యార్డు గణేష్ లడ్డూను రూ.2.75 లక్షలకు యలమంచిలి పుల్లారావు అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. అటు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులోని నేరేడ్ మెట్ లో గణేష్ లడ్డూ పదకొండు లక్షలు పలికిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News