: దైవకణాలతో జాగ్రత్త... ప్రపంచాన్నే తుడిచిపెట్టేస్తాయి!: హాకింగ్ హెచ్చరిక
దైవకణాలు అని భావిస్తున్న హిగ్స్ బోసాన్ కణాలతో జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సూచిస్తున్నారు. ఈ కణాలు ప్రపంచాన్నే తుడిచిపెట్టేయగల సామర్థ్యం కలవని ఆయన పరిశోధకులను హెచ్చరించారు. అత్యధిక శక్తి స్థాయుల వద్ద ఈ కణాలు అస్థిరంగా మారతాయని, ఈ పరిస్థితి పెను విపత్తుకు దారితీస్తుందని వివరించారు. కనీసం, ప్రమాదం జరగనుందని హెచ్చరిక జారీచేయడానికి కూడా వ్యవధి ఉండకపోవచ్చని, క్షణాల్లో విధ్వంసం జరిగిపోతుందని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు 2012లో హిగ్స్ బోసాన్ కణాన్ని యూరప్ లో ఉన్న 'సెర్న్' ప్రయోగశాలలో ఆవిష్కరించారు.