: గుండెచప్పుడు పెరిగేకొద్దీ ప్రమాదమే!


గుండెకొట్టుకునే రేటు ఎంత ఎక్కువ అవుతూ ఉంటే అంత త్వరగా మృత్యుముఖానికి చేరువ అవుతున్నట్లే అని తాజా అధ్యయనం నిరూపిస్తోంది. సాధారణంగా ఇదివరలో నిమిషానికి 60 నుంచి 100 వరకు ఏ రేటులో గుండె కొట్టుకుంటూ ఉన్నా కూడా సాధారణమైనదిగానే పరిగణించేవారు. అయితే తాజాగా 60 కంటె ఏమాత్రం ఎక్కువ తక్కువ అయినా సరే.. ప్రమాదానికి చేరువ అవుతున్నట్లే అని చెబుతున్నారు.

ఈ విషయాన్ని నిగ్గుతేల్చడానికి కోపెన్‌హెగెన్‌లో ప్రత్యేకంగా పురుషులపై ఓ సర్వే నిర్వహించారు. 1970 - 71 సమయంలోనే ఈ సర్వే ప్రారంభం అయింది. పదిహేనేళ్ల తర్వాత.. 1985 ప్రాంతంలో వారి ఆరోగ్య వివరాలను సేకరించారు. మళ్లీ మరో 16 ఏళ్ల తరువాత వీరిలో ఎందరు బతికున్నారో లెక్కలు తీశారట. గుండె కొట్టుకునే రేటు ఎక్కువగా ఉన్న వారంతా మరణించినట్లు ధ్రువపడింది. ప్రతి పదిమందిలో నలుగురు మరణించినట్లు వీరి సర్వే తేల్చింది. హృదయ స్పందన పెరిగే కొద్దీ ప్రమాదావకాశాలు పెరుగుతున్నట్లేనని వారు తేల్చారు.

  • Loading...

More Telugu News