: జమ్మూ చేరుకున్న ప్రధాని మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ చేరుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో వరద పరిస్థితిని ఆయన సమీక్షిస్తున్నారు. గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జమ్మూకాశ్మీర్ లో వరద బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా దాదాపు 150 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని 10 జిల్లాలు వరద తాకిడికి గురయ్యాయి. వరద బాధితులను కాపాడటానికి హెలికాప్టర్లను, 50 బోట్లను అందుబాటులో ఉంచారు.