: జగ్గారెడ్డికి ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్టే: హరీష్ రావు


మెదక్ ఉపఎన్నిక ప్రచారంలో నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచార పర్వాన్ని నేతలు రక్తి కట్టిస్తున్నారు. నిన్న ప్రచారంలో పాల్గొన్న టీఎస్ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీష్ రావు తనదైన శైలిలో వాగ్బాణాలు వదిలారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డికి ఓటేస్తే బెజవాడ బాబుకు వేసినట్టేనని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మురికి కుంటలోకి పోతుందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నిక కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయనుందని... ఈ విషయాన్ని మరువరాదని ఓటర్లకు విన్నవించారు. తెలంగాణపై ప్రధాని మోడీ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని... ఆయన ప్రధాని అయిన తర్వాత జరిగిన తొలి పార్లమెంటు సమావేశాల్లోనే పోలవరంను ఏపీలో కలిపేశారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News