: పాశ్చాత్యశైలితో చావు దగ్గరవుతుంది


పిజ్జాలు, బర్గర్లు, సబ్‌లు... ఇవన్నీ అమెరికా వోడి తిండి .. అవి తింటే మనం కూడా అమెరికా వోడిలాగా మారిపోయినట్లే అని చాలామంది ఉబలాటపడుతున్నారు. ఆహారం విషయంలో పాశ్చాత్యశైలి విధానాన్ని అవలంబిస్తే చాలా త్వరగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. వృద్ధాప్యం వచ్చేసరికి చుట్టుముట్టే రోగాలు కూడా పెరుగుతాయిట. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొవ్వు, చక్కెర, ఉప్పు, వేపుళ్లకు దూరంగా ఉండడం తప్పనిసరి అనేది మనకు తెలిసిన సంగతే. అయితే పాశ్చాత్య ఆహారంలో చాలా సాధారణం అయిన వీటిని ఎక్కువగా తినడం వల్లన వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్యఛాయలు త్వరగా వస్తాయట. గుండెజబ్బులకు కూడా ఇదే కారణమట. అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రచురించిన ఓ అధ్యయనం ఈ వివరాలను వెల్లడించింది.

  • Loading...

More Telugu News