: చంబల్ నదిలో చేపల్లేవ్... మొసళ్ళకు మనుషులే ఆహారం!


మధ్యప్రదేశ్ లోని చంబల్ నదీ పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజలు ఇప్పుడు మొసలి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్నారు. ఇటీవల చంబల్ నదిలో పలువురు మొసళ్ళబారినపడడం వారిని కలవరపరుస్తోంది. ఆ నదిలో చేపలు అయిపోవడంతో మొసళ్ళకు కరవొచ్చి పడింది. దాంతో, అవి మనుషులను లక్ష్యంగా చేసుకున్నాయి. నీటి కోసమో, చేపల వేట కోసమో గ్రామస్తులు నది ఒడ్డుకు వచ్చినప్పుడు నీటిలో దాగున్న మొసళ్ళు వాళ్ళను ఒక్కదుటున నోట కరుచుకుంటున్నాయి. మొత్తమ్మీద 35 నుంచి 40 మొసళ్ళు చంబల్ పరీవాహక ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని ఉంటున్నాయని తెలుస్తోంది. ఇటీవలే పఠారా గ్రామంలో ఓ బాలుడు ఇలాగే బలయ్యాడు. తన స్నేహితులతో కలిసి స్నానం చేద్దామని నది ఒడ్డుకు వెళ్ళిన ప్రదీప్ అనే పన్నెండేళ్ళ కుర్రాడిని మొసలి బలిగొన్నది. దీంతో, గ్రామస్తులు అటవీశాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దీనిపై, అధికారులు స్పందిస్తూ, మొసళ్ళు ఉన్న ప్రాంతం జాతీయ చంబల్ సంరక్షణ కేంద్రం పరిధిలోకి వస్తుందని, అది రక్షిత ప్రాంతమని తెలిపారు.

  • Loading...

More Telugu News