: పెళ్లి ఫోటోల పారితోషికాన్ని విరాళంగా ఇస్తున్న జంట
హాలీవుడ్ స్టార్ కపుల్ బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ ఆగస్టు 23న రహస్యంగా వివాహ బంధంతో దంపతులుగా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తీసిన వారి ఫోటోలను అనంతరం 'హలో', 'పీపుల్' మ్యాగజైన్లు ప్రచురించాయి. అందుకుగానూ ఈ జంటకు ఐదు మిలియన్ డాలర్లను సదరు మ్యాగజైన్లు ముట్టజెప్పాయి. ఈ మొత్తాన్ని ఓ స్వచ్ఛంధ సంస్థకు విరాళంగా ఇవ్వాలని బ్రాడ్, ఏంజెలినా నిర్ణయించుకున్నారట. గతంలోనూ తమ పిల్లలకు సంబంధించిన ఫోటోల ప్రచురణ ద్వారా వచ్చిన పద్నాలుగు మిలియన్ డాలర్లను కూడా వారు విరాళంగానే ఇచ్చారట.