: ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ని బాదిన మృతుడి బంధువులు


ప్రభుత్వ వైద్యుడి నిర్వాకం వల్ల ఓ రోగి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ వివరాల్లోకి వెళితే... ఏలూరు ప్రధాన ప్రభుత్వాసుపత్రిలో జ్వరం, కీళ్ల నొప్పులతో దుర్గారావు (23) అనే తాపీ మేస్త్రీ జాయిన్ అయ్యాడు. సాయంత్రం అతనికి వాంతులు రావడం, ఊపిరి తీసుకునేందుకు తీవ్రమైన ఇబ్బంది పడుతుండడంతో, ఆసుపత్రి వైద్యుడికి రోగి బంధువులు సమాచారమిచ్చారు. పర్వాలేదని అంతా సర్దుకుంటుందని చెప్పిన వైద్యుడు నర్సును పంపి ఓ ఇంజక్షన్ ఇప్పించారు. ఆమె ఇంజెక్షన్ చేసిన పది నిమిషాలకు దుర్గారావు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతని బంధువులు ఈ ఉదయం ఆసుపత్రికి చేరుకుని డ్యూటీ డాక్టర్ పై దాడి చేశారు. మద్యం సేవించిన వైద్యుడి నిర్లక్ష్యమే అతని మృతికి కారణమని ఆరోపిస్తూ ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు.

  • Loading...

More Telugu News