: సాక్షాత్తు మోడీ వచ్చినా జగ్గారెడ్డికి డిపాజిట్ దక్కదు: కేటీఆర్
మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి తరపున ప్రచారం చేసేందుకు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ప్రచారం చేసినా డిపాజిట్ దక్కదని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెదక్ జిల్లా మిరుదొడ్డిలో ఆయన మాట్లాడుతూ, సమైక్యవాది అయిన జగ్గారెడ్డి అంటేనే మెదక్ జిల్లా ప్రజలు భగ్గు మంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిదే విజయమని తెలిపిన ఆయన, కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి మెదక్ ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.