: తప్పు నాది కాదు తుమ్మలదే!: కేసీఆర్
ఖమ్మం జిల్లా టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... 'తప్పు నాది కాదు తుమ్మలదే'నని నవ్వుతూ అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో చేరుతున్నారంటే ఇంత మంది వస్తారని ఊహించలేదని, కానీ భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలకు స్వాగతం పలుకుతున్నానని అన్నారు. తుమ్మల అనుచరగణంతో టీఆర్ఎస్ భవన్ నిండిపోయింది. అది చూసి ఆనందపడిన కేసీఆర్ వాస్తవానికి ఈ కార్యక్రమం నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసి ఉంటే బావుండేదని, కానీ ఇంత మంది వస్తారని ముందుగా ఊహించలేదని అన్నారు. అందుకే తప్పు తనది కాదు తుమ్మలదేనని ఆయన చమత్కరించారు.