: టీఆర్ఎస్ పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు
టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన తుమ్మల అభిమానులతో తెలంగాణ రాష్ట్ర భవన్ నిండిపోయింది. తుమ్మలతో కలసి ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు టీఆర్ఎస్ నేతలు కే.కేశవరావు, రమణాచారి తదితరులు పాల్గొన్నారు. తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఖమ్మం జిల్లాలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది.