: విద్యార్థుల పట్ల టీచర్లు భేదాలు చూపకూడదు: మోడీ
విద్యార్థుల పట్ల టీచర్లు ఎటువంటి భేదాలు చూపకూడదని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లల్ని సమానంగా ఎలా చూస్తారో, గురువులు కూడా అలాగే భావించాలని ఆయన సూచించారు. ‘మీరు బాల్యంలో అల్లరి చేశారా?’ అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, బాల్యంలో అల్లరి చేయకుండా ఎవరు ఉంటారని ఆయన విద్యార్థులను ప్రశ్నించారు. తాను కూడా అల్లరి చేశానని అన్నారు. పెళ్లిళ్లలో షెహనాయ్ వాయించే వాళ్ల దగ్గరకు వెళ్లి తాను కీటకాలను చూపించి అల్లరి చేసేవాడినని ఆయన తెలిపారు. పెళ్లిళ్లలో కూర్చున్న వారి దగ్గరకు వెళ్లి స్టాప్లర్ తో పిన్ లు కొట్టేసేవాళ్లమని ఆయన తెలిపారు. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి బాలికా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. బాలికలు ర్యాంకులు సాధించినప్పుడు ఆనందం కలుగుతుందని ఆయన తెలిపారు. బాలిక చదివితే ఇంట్లో అందరూ చదువుతారని ఆయన చెప్పారు. బాలుడు చదివితే సమాజానికి ఉపయోగం ఉన్నా లేకున్నా, బాలిక చదివితే సమాజానికి ఉపయోగమని ఆయన తెలిపారు. ప్రతి స్కూల్ లో మరుగుదొడ్లు ఉండాలని ఆయన సూచించారు. అందుకే మరుగుదొడ్ల కోసం బాలలు ఇబ్బంది పడడం చూడలేనని ఆయన స్పష్టం చేశారు.