: అసెంబ్లీ సమావేశాల కన్నా ఉపాధ్యాయ దినోత్సవమే నాకు ముఖ్యం: చంద్రబాబు


అసెంబ్లీ సమావేశాల కన్నా తనకు ఉపాధ్యాయ దినోత్సవమే ముఖ్యమని... అందుకే అసెంబ్లీకి వెళ్లకుండా ఈరోజు గుంటూరు వచ్చానని చంద్రబాబు అన్నారు. సత్య నాదెళ్ల మైక్రోసాప్ట్ సీఈవోగా ఎదిగి తెలుగువారి సత్తా చాటారని చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సరైన కాలేజీలు, వసతులు లేవని చంద్రబాబు ఆవేదన చెందారు. అయితే, తాను సంక్షోభంలో కూడా అవకాశం వెతుక్కుంటానని... రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను దేశానికి గర్వకారణంగా నిలిచేలా అభివృద్ధి చేస్తాననీ అన్నారు.

  • Loading...

More Telugu News