: చెంగల్రాయుడుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసిచ్చిన జూపూడి


ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్, చెంగల్రాయుడుల మధ్య వివాదం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మాట్లాడుతున్న తనను చెంగల్రాయుడు దూషించి అవమానించారని జూపూడి నిరసన వ్యక్తం చేశారు. ఛైర్మన్ పోడియం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. అంతేకాకుండా, చెంగల్రాయుడుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసును కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ, దళితుల గొంతును వినిపించడానికే తాను సభకు హాజరవుతున్నానని... నోరు మూసుకుని కూర్చోవడానికి కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News