: కేరళ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్
కేరళ రాష్ట్ర గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ పి.సదాశివం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అశోక్ భూషన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం తిరువనంతపురంలోని రాజ్ భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ, ఆయన మంత్రివర్గ సహచరులు, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పి.జె.కురియన్, కేరళ అసెంబ్లీ స్పీకర్ కార్తికేయన్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. యూపీఏ హయాంలో కేరళ గవర్నర్ గా నియమితులైన షీలా దీక్షిత్ తన పదవికి రాజీనామా చేయడంతో... ఆమె స్థానంలో నూతన గవర్నర్ గా సదాశివం నియమితులయ్యారు.