: రాజధానిపై చర్చ జరగాలి: రఘువీరా


ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సమగ్ర చర్చ జరగాలని పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, శాస్త్రీయ పధ్ధతిలో రాష్ట్ర రాజధాని ఎంపిక జరగాలని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను బహిర్గతపర్చాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేదీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రాజధానిపై చర్చ జరిగితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లవని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News