: రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడిపై అరెస్టు వారెంట్


కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడపై బెంగళూరు కోర్టు అరెస్టు వారెంట్, లుకౌట్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతనిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి కార్తీక్ తనను మోసం చేశాడని, ఇప్పుడు మరొకరితో నిశ్చితార్థం చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ కన్నడ వర్ధమాన నటి మైత్రేయి కొన్ని రోజుల కిందట కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కార్తీక్ లొంగిపోని నేపథ్యంలో కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది.

  • Loading...

More Telugu News