: 'విజయవాడ పరిసరాల్లో రాజధాని' ప్రకటనపై సంబరాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. బెజవాడ నగరంలోని టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు పలువురు సంతోషంతో మిఠాయిలు పంచుకున్నారు. పలుచోట్ల స్థానికులు బాణాసంచా కాల్చి ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ఇటు, రాజధాని ప్రకటనపై రాయలసీమలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తొలుత నుంచీ రాయలసీమలో ఒక ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.