: రాయలసీమకు శాంతిభద్రతలే సమస్య, ఆ ఇబ్బంది లేకపోతే అభివృద్ధిలో దూసుకుపోతుంది: సీఎం
రాయలసీమ అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులున్నాయనీ... కానీ, శాంతిభద్రతల సమస్య బాగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. రాయలసీమలో శాంతిభద్రతలు గనుక మెరుగుపడితే ఆ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమకు ఉన్న సహజ సంపద దేశంలో మరే ప్రాంతంలోనూ లేదని ఆయన వ్యాఖ్యానించారు.