: మధ్యాహ్నం 11.16కు రాజధానిపై సీఎం ప్రకటన, వైసీపీ ఆందోళనతో ప్రకటన ఏ విధంగా చేస్తారోనని సస్పెన్స్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... ముహూర్తం ప్రకారం శాసనసభలో సరిగ్గా మధ్యాహ్నం 11 గంటల 16 నిమిషాలకు రాజధానిపై ప్రకటన చేయనున్నారు. అయితే, సభలో ఇంకా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించే ఉద్దేశంతో ఉండడంతో రాజధానిపై ప్రకటన చంద్రబాబు ఎలా చేస్తారోనని రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.