: రేపటి నుంచి రాజ్ నాథ్ సింగ్ కాశ్మీర్ పర్యటన


కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్ర, శనివారాల్లో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించనున్న రాజ్ నాథ్, స్థానిక ప్రజలతో మమేకం కావడంతో పాటు భద్రతా బలగాలతోనూ భేటీ కానున్నారు. రణబీర్ సింగ్ పురా ప్రాంత ప్రజలతో ప్రత్యేకంగా భేటీ కానున్న రాజ్ నాథ్, పాక్ కాల్పుల కారణంగా వారు పడే ఇబ్బందులపై ఆరా తీయనున్నారు. అంతేకాక, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడతామని కూడా వారికి హామీ ఇవ్వనున్నట్లు సమాచారం. తదనంతరం, అదే ప్రాంతంలోని బీఎస్ఎఫ్ జవాన్లతో భేటీ కానున్న రాజ్ నాథ్, పాక్ దుశ్చర్యలపై సమీక్ష చేపట్టనున్నారు. కాశ్మీరీ పండిట్లతోనూ ఆయన భేటీ కానున్నారు. పెరుగుతున్న పాక్ దుశ్చర్యలు, రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ కాశ్మీర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News