: రాజధానిపై ప్రకటన తర్వాత చర్చకు అర్థం ఏముంటుంది: జగన్
ప్రభుత్వం రాజధానిపై స్టేట్ మెంట్ ఇచ్చిన తర్వాత... చర్చ జరపడంలో అర్థం లేదని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ముందు చర్చ జరిపిన తర్వాతే... రాజధాని విషయాన్ని ప్రకటించాలన్నారు. 1953లో కూడా ముందు సభలో చర్చ జరిపిన తర్వాతే రాజధానిని నిర్ణయించారన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం కావాలనే 'బుల్ డోజ్' చేస్తోందని ఆయన ఆరోపించారు.