: 270 కోట్లు పలుకుతున్న గోల్కొండ 'గులాబీ' వజ్రం


1935 కాలంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా టైమ్‌ మాగజైన్‌ ప్రస్తుతిని అందుకున్న నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ వద్ద అప్పట్లో ఉన్నటువంటి.. గులాబీరంగు వజ్రం ఇప్పుడు వేలానికి రానుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్న ఈ వజ్రం ప్రస్తుత పేరు ‘ప్రిన్సీ’.

1960 ప్రాంతాల్లో ఈ వజ్రాన్ని వాన్‌క్లీఫ్‌ అండ్‌ ఆర్పెల్స్‌ సంస్థ 46 వేల పౌండ్లకు వేలంలో కొంది. ఇప్పుడు న్యూయార్క్‌లోని ప్రఖ్యాత వేలం సంస్థ క్రిస్టీస్‌ ఆక్షన్‌ హౌస్‌ వారు వేలానికి పెట్టారు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరూ ధరించని ఈ 35.65 కారెట్ల వజ్రం ధర 270 కోట్ల రూపాయల వరకు పలకవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ గులాబీరంగు వజ్రం 300 ఏళ్ల కిందట గోల్కొండ గనుల్లో బయటపడిన అతిపెద్ద వజ్రం కావడం విశేషం.

  • Loading...

More Telugu News