: జైళ్లలో అవినీతిపై తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ సీరియస్
జైళ్లలో జరుగుతున్న అవినీతిపై తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అడ్వైజ్, వార్నింగ్, యాక్షన్ తో చర్యలుంటాయని ఆయన చెప్పారు. ఇవాళ ఖమ్మం, సంగారెడ్డి, హుజురాబాద్, నిజామాబాద్ జైలు అధికారులు, సిబ్బందికి వీకే సింగ్ క్లాస్ తీసుకున్నారు. రెండ్రోజుల క్రితం చర్లపల్లి జైలు సిబ్బందికి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఖైదీలకు సెల్ ఫోన్లు అందించడం, వారి నుంచి లంచాలు తీసుకోవడం వంటివి రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రౌడీషీటర్ యాదగిరికి సెల్ ఫోన్ ఎవరిచ్చారన్న దానిపై విచారణ జరుపుతున్నామని ఆయన చెప్పారు.