: ఆర్టీసీలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ
ఆర్టీసీలో 2,327 మంది ఒప్పంద ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల ఒకటి నుంచి క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. మొత్తం 615 మంది కండక్టర్లు, 1712 మంది డ్రైవర్ల సర్వీసులను క్రమబద్ధీకరించినట్లు ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం తెలిపింది.