: గంగానది ప్రక్షాళనకు కేంద్రం ఇచ్చిన ప్రణాళికపై సుప్రీం అసంతృప్తి


బీజేపీ ఎన్నికల హామీల్లో ప్రధానమైనది గంగానది ప్రక్షాళన. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ రూపంలో సమర్పించిన ప్రణాళికపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీని ప్రకారం అయితే గంగానది ప్రక్షాళన 200 ఏళ్ల తర్వాత కూడా పూర్తికాదని సుప్రీం పేర్కొంది. నది ప్రక్షాళనకు దశల వారీ ప్రణాళికను రూపొందించాలని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అంచెలంచెలుగా లక్ష్యాలు నిర్దేశించాలని, ఇందుకోసం మూడు వారాల్లోగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమకు తెలియజేయాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది. సాధారణ పౌరులకు సైతం అర్థమయ్యేలా ఆ ప్రణాళిక ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది.

  • Loading...

More Telugu News