: దక్షిణాఫ్రికా వన్డే సారథికి ఉసేన్ బోల్ట్ కితాబు
దక్షిణాఫ్రికా వన్డే జట్టు సారథి ఏబీ డివిల్లీర్స్ కు అద్భుతమైన ప్రశంస లభించింది. డివిల్లీర్స్ ప్రపంచంలోకెల్లా వేగంగా పరిగెత్తే క్రికెటర్ అని పరుగుల చిరుత, వరల్డ్ ఫాస్టెస్ట్ రన్నర్ ఉసేన్ బోల్ట్ కితాబిచ్చాడు. బెంగళూరులో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, "నా వరకైతే ఏబీ డివిల్లీర్సే క్రికెటర్లలో ఫాస్టెస్ట్. అందులో సందేహమేలేదు. క్రికెటర్లలో 100మీ చాంపియన్ ఎవరంటే అతని పేరే చెబుతాను" అని వ్యాఖ్యానించాడు. ఇక, తన స్నేహితుడు క్రిస్ గేల్ పైనా కామెంట్ చేశాడీ జమైకన్. క్రికెటర్లందరిలోనూ నెమ్మదిగా పరిగెత్తే ఆటగాడు గేల్ అని పేర్కొన్నాడు. పరిగెత్తడం ఆపేయాలని గేల్ కు ఎప్పుడూ చెబుతుంటానని అన్నాడు. వేగంగా పరిగెత్తే ప్రయత్నంలో, ప్రతిసారీ, అతను కండరాల నొప్పికి గురయ్యాడని తెలిపాడు.