: కోరుట్లలో విఘ్నాధిపతికి 444 రకాల నైవేద్యాలు
కరీంనగర్ జిల్లా కోరుట్లలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విఘ్నాధిపతికి 444 రకాల నైవేద్యాలను భక్తులు సమర్పించారు. స్థానిక వినోభా రోడ్డులోని లంబోదరుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ వినాయకుడిని ప్రతిష్ఠించిన నవ హిందూ యూత్ సభ్యులు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.