: మహిళలు, బాలికల భద్రతపై మరో కమిటీ వేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు, బాలికల భద్రతపై ఉన్నతాధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, స్మితా సబర్వాల్, శైలజా రామయ్యార్ నియమితులు కాగా, ఐపీఎస్ అధికారులు సౌమ్యమిశ్రా, చారు సిన్హా, స్వాతి లక్రా నియమితులయ్యారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై నివేదిక 15 రోజుల్లో సమర్పించాలని వీరిని ప్రభుత్వం ఆదేశించింది. వీరి సూచనల ప్రకారం తెలంగాణలో మహిళలు, బాలికల భద్రతపై చర్యలు తీసుకోనున్నారు.