: భారత్ ముందు సింపుల్ టార్గెట్
ఇంగ్లండ్ తో నాలుగో వన్డేలో భారత్ ముందర ఓ మోస్తరు లక్ష్యం నిలిచింది. టీమిండియా బౌలర్లు సమష్టిగా కదం తొక్కడంతో ఆతిథ్య ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ తేలిపోయారు. 49.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటయ్యారు. ఆ జట్టులో మొయిన్ అలీ (67) టాప్ స్కోరర్. రూట్ 44, మోర్గాన్ 32 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా... భువనేశ్వర్, జడేజా తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ ను దెబ్బకొట్టారు.