: దారి తప్పిన ఉపాధ్యాయుడ్ని ఉతికేశారు
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పడంతో గ్రామస్థులు గట్టిగా బుద్ధి చెప్పారు. చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం ఎల్లంకివారిపాలెంలో ఓ విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక అతని నిర్వాకాన్ని తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులకు వివరించింది. రంగంలోకి దిగిన గ్రామ మహిళలు ఉపాధ్యాయుడిని ఉతికేశారు. బాలిక తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.