: బాలకృష్ణను అనుకరిస్తూ సెటైర్లు వేసిన రోజా
నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై రోజా సెటైర్లు వేశారు. తామిద్దరం ఆరు సినిమాల్లో నటించామని తెలిపిన రోజా... ఆయన సినిమా స్టయిల్లో అసెంబ్లీలో మాట్లాడితే ఎలా ఉంటుందన్న విషయాన్ని మీడియా కెమెరా ముందు ప్రదర్శించారు. అసెంబ్లీ లాబీల్లో ఆమె బాలయ్యను అనుకరిస్తూ... "ఆ రోజుల్లో నాన్న గారూ...." అంటూ నవ్వేశారు. మీడియా ప్రతినిధి ఇంకా మాట్లాడాలని రోజాను కోరగా... "ఆ రోజుల్లో నాన్నగారు భైరవద్వీపం సినిమాకు డైరక్షన్ చేస్తే... మేమూ రోజా నటించాం" అంటూ చేతులు తిప్పుతూ బాలయ్యలా హావభావాలు ప్రదర్శించారు. దీంతో, అక్కడున్న వారందరూ నవ్వుల్లో మునిగిపోయారు.