: ఇంగ్లండ్ ఓపెనర్లను తిప్పి పంపిన భువనేశ్వర్


బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ - భారత్ జట్ల మధ్య నాల్గో వన్డే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. దాంతో, తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 4.4 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు హేల్స్ 6, కుక్ 9 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లను తీసి ఇంగ్లండ్ బ్యాట్ మెన్ ను కట్టడి చేశాడు. ప్రస్తుతం బాలెన్స్ (1), రూట్ (0) క్రీజులో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News