: జగ్గారెడ్డికి డిపాజిట్ కూడా రాదు: కేటీఆర్


మెదక్ ఉపఎన్నికలో విమర్శలు ఊపందుకున్నాయి. ప్రచారం ఉద్ధృతస్థాయికి చేరుకుంటోంది. జగ్గారెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెదక్ లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ విధానాలను కొని తెచ్చుకున్న టీడీపీ మెదక్ లో పోటీకి అభ్యర్ధిని కూడా అదే పార్టీ నుంచి తెచ్చుకుందని అన్నారు. గతంలో లక్ష మెజారిటీ రాకుంటే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని చెప్పుకున్న జగ్గారెడ్డికి ఈసారి డిపాజిట్ గల్లంతవ్వడం ఖాయమని ఆయన తెలిపారు. మెదక్ ఓటర్లు తెలివైన నిర్ణయం తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News