: తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతున్న వర్షాలు


మధ్యప్రదేశ్ వాయవ్య ప్రాంతంపై అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మహారాష్ట్రలోని విదర్భ, మధ్యప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొమరాడలో 4 సెం.మీ, కురుపాంలో 3 సెం.మీ, నరసాపురంలో ఒక సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. చోడవరం, అమలాపురం, పాడేరు, శ్రీకాళహస్తి, అవుకులో ఒక సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదైంది. గత నాలుగు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News