: అసెంబ్లీలోనూ ‘అన్న క్యాంటీన్లు’ వస్తున్నాయ్!
శాసనసభ ప్రాంగణంలోనూ ‘అన్న క్యాంటీన్లు’ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. తమిళనాడు తరహాలో సబ్సిడీ రేట్లపై అల్పాహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ లో ‘అన్న క్యాంటీన్లు’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 25 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. విశాఖపట్నంలో 15, గుంటూరులో 10, అనంతపురంలో ఐదు, తిరుపతిలో ఐదు చొప్పున అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.