: పవన్ జన్మదినం రోజున ఫ్లెక్సీ కడుతూ అభిమాని మృతి


ప్రకాశం జిల్లాలో పవన్ కల్యాణ్ అభిమాని అయిన ఓ యువకుడు ఈ రోజు మృతి చెందాడు. చీరాల-ఒంగోలుకు మధ్య ఉన్న తీరప్రాంత గ్రామం చిన్నగంజాం గ్రామంలో ఉండే రమేష్, అతని స్నేహితులు పవన్ కల్యాణ్ కు వీరాభిమానులు. నేడు పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలోని మెయిన్ రోడ్డు మీద ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి రమేష్ దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో అతని తో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News